
సాక్షి, ఏలూరు: గత టీడీపీ ప్రభుత్వంలో దళిత వర్గాలను పూర్తిగా అణచి వేశారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వ లేకపోతున్నారన్నారు. రేషన్, పింఛన్ కార్డులు తీసేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉగాదికి అర్హత ఉన్న అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 11.87 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు.