సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంట విషాదం నెలకొన్నది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వరరావు(70) కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని ఖమ్మం జిల్లా వైరాకు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోదరుడి మరణవార్త తెలియగానే భట్టి విక్రమార్క తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి వైరాకు ఆయన వెళ్లనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం
Published Tue, Feb 13 2024 11:35 AM | Last Updated on Tue, Feb 13 2024 11:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment