సాక్షి, ఖమ్మం: రైతు భరోసా పథకంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతుల నుంచి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ రైతులు 10 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులు సూచించారు.
బీడు భూములు, పంట సాగు చేయని వారికి ఇవ్వొద్దని సూచించారు.. ఇదే సందర్భంలో కౌలు రైతులకు సాగు చేయడానికి ఇచ్చిన పట్టా భూములు ఉన్న రైతులు అంగీకరణ పాత్రలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడగగా రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మీము ఇవ్వడానికి సిద్ధంగా లేమని పట్టా భూములు ఉన్న రైతులు తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని మంత్రులకు సూచించారు. కౌలు రైతుల విషయంలో మాత్రం మంత్రుల సబ్ కమిటీ సమావేశం లో ఎటువంటి క్లారిటీ రాలేదు.
రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతి కి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా హామీ ఇచ్చిందని.. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ నియామకం చేసింది.
ఈ సబ్ కమిటీలో తాను, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరావు దుద్దిల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నాము.. రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు.
ఇది పేదోడి ప్రభుత్వం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఇది పేదోడి ప్రభుత్వం.. ఓపెన్ గా డిబెట్ చేసి రైతుల నుంచి వివరాలు తీసుకోవాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని జిల్లా లో సబ్ కమిటీ పర్యటించి వివరాలు సేకరిస్తుంది. మా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొం. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయి. ప్రతి పక్ష బీఆర్ ఎస్ ఇష్టానుసరంగా మాట్లాడుతుంది.. రైతుల ప్రభుత్వం ఎవరిదో త్వరలో రైతులే చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment