డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ | Andhra Pradesh Latest News: Pawan Kalyan Take Charge As Deputy CM | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌

Published Wed, Jun 19 2024 10:57 AM | Last Updated on Wed, Jun 19 2024 1:09 PM

Andhra Pradesh Latest News: Pawan Kalyan Take Deputy CM charges

అమరావతి, సాక్షి: జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలోని క్యాంప్‌ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య.. అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్.. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి&గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారన్నది తెలిసిందే.

డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ రెండు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకం, ఉద్యాన వన పనులకు నిధులు మంజూరు ఫైల్‌ మీద తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయితీ భవనాల నిర్మాణాల ఫైల్‌పై రెండో సంతకం చేశారాయన.  బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు పలువురు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. 

అంతకు ముందు క్యాంప్‌ కార్యాలయం వద్ద పవన్‌కి గౌరవ వందనం లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, దుర్గేష్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పవన్‌ ఇవాళంతా​ బిజి బిజీగా గడపనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం.. ఆపై పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీస్‌లోనే పవన్‌ బస చేయనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement