ట్రిపుల్‌ తలాక్‌ బ్యాన్‌, గోవధపై ఫత్వా! | AISPLB for Triple Talaq Ban, Issues Fatwa Against Cow Slaughter | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ తలాక్‌ బ్యాన్‌, గోవధపై ఫత్వా!

Published Wed, Apr 5 2017 3:44 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

ట్రిపుల్‌ తలాక్‌ బ్యాన్‌, గోవధపై ఫత్వా!

ట్రిపుల్‌ తలాక్‌ బ్యాన్‌, గోవధపై ఫత్వా!

న్యూఢిల్లీ: ఆలిండియా షియా పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎస్‌పీఎల్‌బీ) బుధవారం మూడు కీలక తీర్మానాలను ఆమోదించింది. దేశంలో కలకలం రేపుతున్న గోవధకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయడమే కాకుండా.. ట్రిపుల్‌ తలాక్‌ నిషేధానికి మద్దతు పలికింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు విషయాన్ని కోర్టు బయట చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
 
లక్నోలో బుధవారం జరిగిన ఏఐఎస్‌పీఎల్‌బీ కార్యవర్గ సమావేశంలో కీలకమైన గోవధను నిషేధిస్తూ ఫత్వాను జారీచేశారు. ఇరాక్‌కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద అయాతుల్లా షేఖ్‌ బషీర్‌ హుస్సేన్‌ నజఫీ నుంచి అనుమతి తీసుకున్న అనంతరం షియా బోర్డు గోవధకు వ్యతిరేకంగా ఫత్వాను అమల్లోకి తెచ్చింది. గోవధ కారణంగా దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, అందుకే ఈ ఫత్వా జారీచేశామని షియా బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement