బహ్రెయిచ్: అయోధ్యలో అభివృద్ధికి ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కారణమంటూ పొగడటమే ఆ మహిళ చేసిన నేరం. ఇందుకు ఆగ్రహిస్తూ భర్త ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భర్తతోపాటు అతడి ఏడుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. బహ్రెయిచ్ జిల్లా మొహల్లా సరాయ్‌కి చెందిన బాధితురాలికి గతేడాది డిసెంబర్‌లో అయోధ్యకు చెందిన అర్షద్‌తో వివాహమైంది. మెట్టినింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చాయి.
ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ప్రధాని మోదీ, సీఎం యోగియే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో, అర్షద్‌కు కోపం వచ్చి ఆమెను వెంటనే పుట్టింటికి పంపేశాడు. బంధువులు నచ్చజెప్పి, ఆమెను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై దుర్భాషలాడుతున్నాడు. అత్త, మరదళ్లు, మరుదులు కలిసి ఆమెను చంపేందుకు యత్నిస్తున్నారు. అర్షద్ చివరికామెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment