
'మంచి హిందువుగా గోవధ నిషేధానికి మద్దతు'
పనాజీ: గోవధకు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థలు చేస్తున్న ప్రచారానికి ఊహించని నాయకుడి మద్దతు లభించింది. పదుదైన మాటలతో నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గోవధ నిషేధానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉత్తముడైన హిందువుగా గోహత్యకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు.
గోవాలో జరుగుతున్న హిందువుల సమావేశంలో గోవధను నిషేధిస్తూ ఓ తీర్మానం ఆమోదించారు. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ... గోహత్యను నిషేధిస్తూ 1930లోనే కాంగ్రెస్ పార్టీ అధికారిక తీర్మానం చేసిందని గుర్తు చేశారు. మొఘళుల కాలం నుంచి గోవధ నిషేధం అమల్లోవుందని తెలిపారు. భోపాల్ రాజకుటుంబం కూడా గోహత్యకు వ్యతిరేమని చెప్పారు.