మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు సంబంధించి ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు సంబంధించి మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. కేసు విచారణ ప్రారంభమైందని, దోషులకు శిక్షపడే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
మంగళూరులో గోమాంసం మార్కెట్లను మూసివేయించే కార్యక్రమంలో భయరంగ్ దళ్ కార్యకర్త అయిన ప్రశాంత్ పూజారీ చాలా కీలకపాత్ర పోషించేవాడు. గోహత్యను నిషేధించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాల రూపకల్పనలో కూడా అతడు మేటి. ఇలా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రశాంత్పై ఒకేసారి ఆరుగురు ముస్లిం వ్యక్తులు ఈ నెల(అక్టోబర్) 9న మూడ్బిద్రి వద్ద దాడి చేసి ఉరి తీసి హత్య చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు.
మంగళూరు హత్య కేసులో ఎనిమిదిమంది అరెస్టు
Published Wed, Oct 21 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM
Advertisement
Advertisement