
'గెలిపిస్తే గోవధను నిషేధిస్తాం'
బిహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే గోవధను నిషేధిస్తామని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెబుతున్నారు.
పట్నా: ఒకవైపు గోవధ, గోమాంసం నిషేధంపై తీవ్ర వివాదం చెలరేగుతోంటే మరోవైపు బిహార్ బీజేపీ నాయకులు ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే గోవధను నిషేధిస్తామని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వాగ్దానం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోవధను నిషేధించడం ద్వారా వేలాది ఆవులను రక్షించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ప్రధాని తన చర్య ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారంటూ ట్వీట్ చేశారు. ఆవులను రక్షించడం ద్వారా గోపాలకుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.