
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్’ అని ట్వీట్ చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు.
చదవండి: మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్: సీఎం జగన్
త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2022