రాయచూరులో బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. త్యాగం, బలిదానం, పరిహ తానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా...
రాయచూరు, న్యూస్‌లైన్ : రాయచూరులో బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. త్యాగం, బలిదానం, పరిహ తానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానంలో ఉదయం 9 గంటలకు వందలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. చిన్నారులు, యువకులు, పెద్దలు ఈ ప్రార్థనలలో పాల్గొన్నారు. సత్ప్రవర్తన, పరోపకారంతో జీవించి అందరికి మేలు చేయాలని మత పెద్దలు ఉద్భోదించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ప్రార్థనల కోసం మున్సిపాలిటీ, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, జిల్లాధికారి ఎస్‌ఎన్.నాగరాజ్, ఎస్పీ ఎంఎన్.నాగరాజ్ పాల్గొన్నారు.
మాన్వి : పట్టణంతో పాటు తాలూకాలో బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పట్టణంలోని వివిధ మసీదులలో ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేసి, అనంతరం స్థానిక నమాజ్‌గేరి కొండలోని ఈద్గా మైదానానికి చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. అక్కడ అన్వర్ పాషా ఉమరి ఖురాన్ పఠించారు. ఆ తర్వాత పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎస్ బోసరాజు, ఎమ్మెల్యే జీ.హంపయ్య నాయక్, పురసభ అధ్యక్షుడు సయ్యద్ నజీరుద్దీన్ ఖాద్రి, ఉపాధ్యక్షుడు దొడ్డబసప్ప వకీల్, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు ఎం.ఈరణ్ణ గుత్తేదార్, జెడ్పీ స్థాయీ సమితి అధ్యక్షుడు హనుమేష్ మద్లాపూరు, కాంగ్రెస్ వెనుకబడిన వర్గాల విభాగం తాలూకా అధ్యక్షుడు జీ.నాగరాజు, పురసభ సభ్యుడు హుసేన్‌బేగ్, పురసభ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్, రంగబెళగు కళాకారుల సంఘం అధ్యక్షుడు మహ్మద్ ముజీబ్ తదితరులు ముస్లిం లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.