బక్రీద్, వినాయక నిమజ్జనం నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.
పాతబస్తీలో ఫ్లాగ్‌మార్చ్
Sep 12 2016 3:05 PM | Updated on Aug 21 2018 7:18 PM
హైదరాబాద్: బక్రీద్, వినాయక నిమజ్జనం నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. సోమవారం దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పాతబస్తీలోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. మత ఘర్షణలు జరిగే అవకాశాలున్న మొగల్‌పురా, శాలిబండ, ఫలక్‌నుమా, మీర్‌చౌక్, హుస్సేనీ ఆలం, కామాటిపురా, కాలపత్తర్ ప్రాంతాల్లో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మొత్తం వెయ్యి మంది రెండు గ్రూపులుగా ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. పర్వదినాలను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవచ్చుననే భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. నిమజ్జనం రోజు (15) ఒక్క దక్షిణ మండలం పరిధిలోనే 3,000 మంది భద్రతా బలగాలను రంగంలోకి దించనున్నట్లు డీసీపీ తెలిపారు.
Advertisement
Advertisement