ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కింది కోర్టులకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది. 12వ తేదీ యథాతథంగా కోర్టు విధులు కొనసాగుతాయని రిజిష్ట్రార్ జనరల్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైకోర్టుకు 13న సెలవు దినం
Published Thu, Sep 8 2016 8:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement