5 నుంచి గణేశ్ ఉత్సవాలు
5 నుంచి గణేశ్ ఉత్సవాలు
Published Wed, Aug 31 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
– 13న నిమజ్జనం
– బలవంతపు వసూళ్లు వద్దు
– వేడుకలు రామానుజచార్యులకు అంకితం
– జిల్లా ఆధికార యంత్రాగం సహకరించాలి
– గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య
కర్నూలు(టౌన్): నగరంలో గణేశ్ ఉత్సవాలు 5 వ తేదీ నుండి ప్రారంభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్రసమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక వినాయక్ ఘాట్ ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ తేదీన గణేశులను ప్రతిష్టించి ఎనిమిది రోజుల పాటు పూజిస్తారన్నారు. తొమ్మిదో రోజు సెప్టెంబర్ 13వ తేదీ నిమజ్జనం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేశుల వద్ద ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆధ్యాత్యిక వాతావరణాన్ని కల్పించాలాన్నరు. మహిళలు పెద్దసంఖ్యలో ఉత్సవాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడ కూడదని స్థానిక కమిటీలకు సూచించారు. రికార్డు డ్యాన్స్‌లు చేయకూడదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను రామానుజాచార్యులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. మతసామరస్యనికి ప్రతీకగా నిలుస్తున్న కర్నూలులో వినాయక నిమజ్జనం ముందు రోజు వచ్చే బక్రీద్ పండుగను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. వేడుకలు విజయవంతం అయ్యేందుకు జిల్లా అధికార యంత్రాగం సహకరించాలన్నారు. నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ అధికారులు కేసీకి నీరు విడుదల చేయాలన్నారు.
10న విద్యార్థులకు పోటీలు
గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ , చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు సమితి కార్యాధ్యక్షుడు కష్టన్న వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు రామానుజాచార్యులు జీవిత సందేశం, కళశాల విద్యార్థులకు ‘కల్లోల కశ్మీరం– పరిష్కారాలు,’ స్వచ్ఛభారత్‌పై వక్తత్వపు పోటీలు ఉంటాయన్నారు. చిత్రలేఖనానికి సంబంధించి గణేశ్ చిత్రాలు గీయాల్సి ఉంటుందన్నారు. శనివారం ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు బుధవారపేటలోని కేశవ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం హై స్కూలులో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోపు తమ పేర్లను గణేశ్ మహోత్సవ కేంద్ర సమతికి తెలియ జేయాలన్నారు. సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి రంగస్వామి, ఉపాధ్యక్షుడు నాగరాజు, సంఘటన కార్యదర్శి హారీష్‌బాబు, సాంస్త్రతిక విభాగం కార్యదర్శి హనుమంతరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement