
వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశం అన్నారు. బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు జరుపుకొనే ఈ పండుగ త్యాగానికి చిహ్నమని జగన్ పేర్కొన్నారు.