
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు బుధవారం విరామం ప్రకటించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించినట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం ప్రకటించారు. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను నిర్వహించుకునేందుకు వీలుగా పాదయాత్రకు విరామం ప్రకటించినట్టు ఆయన తెలిపారు. పాదయాత్ర గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు పార్టీ తరపున రఘురాం శుభాకాంక్షలు తెలిపారు.