సాక్షి, విశాఖపట్నం: అలుపు..అలసట..విసుగు..విరామం లేకుండా సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో ముగింపుదశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో జిల్లా దాటనున్న బహుదూరపు బాట సారిని చూసేందుకు పల్లెలు పోటెత్తాయి. పరవళ్లు తొక్కాయి. జననేత వెంట అడుగులో అడుగు లేసేందుకు ఉత్సాహంతో ఉరకలెత్తాయి. తమ సమస్యలు చెప్పుకుని ఊరట చెందాయి.ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తోన్న ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో చివరి మజిలికి చేరుకుంది. విజయనగరం జిల్లాలో ప్రవేశించేందుకు ఒకటిన్నర కిలో మీటర్లదూరంలో ఆదివారం పాదయాత్ర నిలిచింది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం క్రాస్ నుంచి ఆదివారం ప్రారంభమైన 268వ రోజు పాదయాత్ర గండిగుండం, గండిగుండం కాలనీ మీదుగా పీఎస్‌ఎల్ కంపెనీ వద్ద తిరిగి పెందుర్తి నియోజక వర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది.
అక్కడ నుంచి పెందుర్తి పారిశ్రామిక ప్రాంతం, అక్కిరెడ్డి పాలెం, జుత్తాడ క్రాస్, రాజయ్యపేట, గుర్రంపాలెం క్రాస్, రాయవరపువానిపాలెం, నీలకంఠా పురం గ్రామాల మీదుగా సరిపల్లి కాలనీ వరకు 5.5 కిలోమీటర్ల మేర ఆదివారం పాదయాత్ర సాగింది. మరికొన్ని గంటల్లో జిల్లా దాటి వెళ్తున్న జననేతతో అడుగులో అడుగులేసేందుకు.. ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు తరలి వచ్చారు. గండిగుండం చుట్టుపక్కల గ్రామాలతో పాటు పెందుర్తి, ముద పాక, గోవిందపురం, బంధంవానిపాలెం, చినముషిడివాడ, సుజాతనగర్ తదితర ప్రాంతాల నుంచి కూడా జననేత కోసం వేలాదిగా తరలివచ్చారు. దారిపొడవునా రోడ్డుపై పూలు జల్లి ఆ పూలదారిపై జననేతను నడిపించారు. పాదయాత్రలో జగన్ వెంట అర కిలోమీటర్ వరకు జనమే జనం. కొన్ని చోట్ల రోడ్లపైకి వచ్చి బారులు తీరిన ప్రజల్ని పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుని ముందుకు సాగేందుకు గంటల సమయం పట్టింది. నీలకంఠాపురం వద్ద గ్రామస్తులు ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పెందుర్తి కో ఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజులతో ఆవిష్కరింపచేశారు.
దారిపొడవునా సమస్యల వెల్లువ
ఇక పాదయాత్ర దారి పొడవునా సమస్యలు వెల్లువెత్తాయి. స్టార్టప్‌కంపెనీలకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఓ స్టార్టప్ కంపెనీ నిర్వాహకుడైన రాజశేఖర్ జగన్‌ను కలిసి వివరించారు. మంగళగిరికి చెందిన చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో జననేతను కలిసి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని వాపోయారు. ముదపాకలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని జగన్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. టీడీపీ వాళ్లకే తప్ప మిగిలిన వారికి ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని, అలాగే అర్హులైన సరే టీడీపీ వాళ్లకు మినహా మిగిలిన వాళ్లకు పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
సంకల్ప పాదయాత్రలో ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కె.వి.సిహెచ్.మోహనరావు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తæ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు అక్కరమాని విజయనిర్మల, అన్నంరెడ్డి అదీప్‌రాజు, డాక్టర్ పి.వి.రమణమూర్తి, కె.కె.రాజు, ఉప్పలపాటి రమణమూర్తి, కరణం ధర్మశ్రీ, విజయనగరం రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, ఎల్.ఎమ్.మోహనరావు, సుంకర గిరిబాబు, జర్సింగ్ సూర్యనారాయణ, విక్రాంత్, అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, విశాఖ పార్లమెంట్ జిల్లా మహిళ అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర యూత్ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయీబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు సిద్ధపటం యానాదయ్య, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్‌వర్మ, వైద్యవిభాగం విశాఖ, తిరుపతి అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ మాధవరెడ్డి, జిల్లా నాయకులు అక్కరమాని వెంకటరావు, బోని బంగారునాయుడు, బంక సత్యం, లొడగల రామ్మోహనరావు, కొలుసు ఈశ్వరరావు, గాదె రోసిరెడ్డి, నక్క కనకరాజు, ఇసరపు గోవింద్, సబ్బవరపు నారాయణమూర్తి, ఎల్.బి.నాయుడు, దాసరి రాజు, సబ్బవరపు ముత్యాలనాయుడు, బొద్దపు రమేష్, గొల్లవిల్లి భాస్కరరావు, కలిగి రాము, జోబుదాసు చిన్ని, పి.శ్రీనివాసరాజు, బొంతు అర్జున్, కర్రి రమణారావు, కరక రామారావు, వంటాకుల ప్రసాద్, గొర్లె రామునాయుడుపాల్గొన్నారు.
జగనన్నకు అందజేస్తా
వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన 1448 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం, వైఎస్ షర్మిలమ్మ చేపట్టిన 2278 కిలోమీటర్ల మరో ప్రజాప్రస్థానం, ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలను 3500 కిలోమీటర్ల మైలురాయిని చూపుతూ భీమిలికి చెందిన శిల్లా కరుణాకరరెడ్డి జ్ఙాపికను తయారు చశారు. ఇందులో నవరత్నాలను పొందుపరిచారు. ఈ జ్ఞాపికను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇవ్వనున్నట్టు తెలిపారు. పార్టీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, నాయకులు చిల్ల శ్రీనివాసరెడ్డి, పిన్నింటి ఎర్రయ్యరెడ్డి , మజ్జి వెంకటరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment