విశాఖసిటీ: తనపై హత్యాయత్నం జరిగినా.. చెదరని చిరునవ్వుతో జనంతో మమేకమయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖకు రానున్నారని అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రజల మనసుల్లో అభిమాన నేతగా పెరుగుతున్న ఆదరణ చూసి, కుట్రలు చేసినా జనంలోనే ఉంటానంటూ.. ప్రజాసంకల్ప యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకోవడం జగన్ ధీరోదాత్తానికి నిదర్శనమన్నారు.
ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకూ తనకు ఏమీ కాదని జననేత ప్రకటించి, తన అభిమానం చాటిచెప్పారన్నారు. భుజంపై కత్తిగాయమై, తీవ్ర రక్తస్రావమవుతుంటే, తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న ఆలోచనతో.. బాధను పంటి బిగువన దాచుకుంటూ పయనమైన జగనన్న అందరి మనసులు దోచుకున్నారని తెలిపారు. హత్యాయత్నం కేసు దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెంప దెబ్బ తగిలేలా జననేతకు స్వాగతం పలకాలన్నారు. ఎక్కడైతే హత్యాయత్నం జరిగిందో, అదే ప్రాంతమైన విశాఖ విమానాశ్రయానికి సాయంత్రం 4.30 గంటలకు జగనన్న రానున్నారని తెలిపారు. జననేతకు స్వాగతం పలికేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రావాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment