నేడు విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర | Today Praja Sankalpa Yatra Entry To Vizianagaram | Sakshi
Sakshi News home page

నేడు విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

Published Mon, Sep 24 2018 7:30 AM | Last Updated on Fri, Sep 28 2018 1:44 PM

Today Praja Sankalpa Yatra Entry To Vizianagaram - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలో ప్రవేశించనుం దని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమి టీ కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించా రు. ఇడుపులపాయలో మొదలైన జననేత పాదయాత్ర విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతుందన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ప్రత్యేకంగా రూపొందించిన పైలాన్‌ను జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారని, అనంతరం కొత్తవలసలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించింది ప్రసంగిస్తారన్నారు.

268వ రోజు ఆదివారం ఉదయం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం క్రాస్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర గండిగుండం కాలనీ, పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పీఎస్‌ఎల్‌ కంపెనీ, పెందుర్తి పారిశ్రామిక ప్రాంతం, అక్కిరెడ్డి పాలెం, జుత్తాడ క్రాస్, రాజయ్యపేట, గుర్రంపాలెం క్రాస్, రాయవరపువానిపాలెం, నీలకంఠాపురం గ్రామాల మీదుగా సరిపల్లి కాలనీ వరకు  5.5 కిలోమీటర్ల మేర సాగిందన్నారు. 269వ రోజు సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు సరిపల్లి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం మీదుగా దేశపాత్రునిపాలెం వద్ద మూడువేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుందన్నారు. అక్కడ నుంచి కొత్తవలస మీదుగా తుమ్మికపాలెం వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారన్నారు. పైలాన్‌ ఆవిష్కరణ, బహిరంగ సభకు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని తలశిల పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement