విశాఖపట్నం :వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 11 జిల్లాలలో మూడు వేల కిలో మీటర్లు పాదయాత్ర పూర్తిచేసుకోబోతున్నా రు. ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజల రాకతో జాతరలను తలపించాయి. పాదయాత్రలో తెలుసుకున్న ప్రజ ల కష్టాలపై అధికార పార్టీపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగసభలలో విమర్శలు ఎక్కుపెడుతుంటే పెద్ద పెట్టున హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు తెరపడినట్టయిందని రాష్ట్రప్రజలు భావిస్తున్నారు.–ఎల్.ఎం.మోహనరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం
రాజన్న స్ఫూర్తితో...
నగరానికి చెందిన మహిళా న్యాయవా ది జగన్నాథ సూర్య ప్రభావతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గతంలో ఆమె ఆచరించి చూపిన మనం మారాలి–సమాజాన్ని మార్చాలి అనే కాన్సెప్ట్‌ను వివరించారు. సమాజంలో పలువురు భద్రత లేని జీవితం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం విధానాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలం అయిందన్నారు. పద్ధతి ప్రకారం అట్టడుగు స్థాయి నుంచి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ప్రజలకు అవగాహన కలిగించడానికి 2014లో ఉభయ గోదావరి జిల్లాలలో 693 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను.
లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయడం లేదన్నా...
అన్నా ఈ ప్రభుత్వం లైబ్రేరియన్ల పోస్టులు భర్తీచేయడంలే దు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1500 ఉద్యోగాలు భర్తీ చేయాల్పి ఉందని లైబ్రేరియన్ల సం ఘ నాయకుడు శ్రీనివాసరావు పాదయాత్రలో జగన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చాడు. ప్రభుత్వం కేవలం 30 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 112 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీలున్నాయన్నారు. డిగ్రీకళాశాలల్లో 95, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లోను సుమారు 2 వేల పోస్టులు భర్తిచేయాల్సి ఉందన్నారు.
శ్రీనివాసరావు, లైబ్రేరియన్ల సంఘ రాష్ట్రనాయకులు,విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment