
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరసోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకోవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ లభించాలని వైఎస్ జగన్ ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment