
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటో పిల్‌గా కోర్టు స్వీకరించింది. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొనగా.. చర్యలు తీసుకోవాలని బక్రీద్‌కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదన్న ధర్మాసనం.. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది.
గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్న ఏజీ ప్రసాద్.. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు.. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని సూచించింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా?
Comments
Please login to add a commentAdd a comment