సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నారు.
కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment