సాక్షి, హైదరాబాద్: బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పర్వదినం సందర్భంగా ఈ నెల 13వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సెప్టెంబర్ 12న బక్రీద్ సెలవు ప్రకటించగా... నెలవంక ఆధారంగా 13వ తేదీన పండుగను జరుపుకోనున్నట్లు ప్రభుత్వానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేసింది.