
త్యాగానికి ప్రతీక బక్రీద్: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదర, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని, దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నమని ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.