గాండ్లపెంట, న్యూస్‌లైన్: రోజుల కేవలం రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారంటూ గాండ్లపెంటకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఉన్న సబ్‌స్టేషన్ వద్ద బుధవారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు.
ఉదయం నుంచి 2 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేసిన అధికారులు రాత్రి 8.30 సమయం వరకూ కోత విధించడంతో గ్రామ సర్పంచ్ కాకర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి , విధుల్లో ఉన్న సిబ్బందిని ఈ విషయమై ప్రశ్నించారు. వారు ఎల్‌ఆర్ ఉందని సమాధానం చెప్పడంతో, ఫోన్‌లో లైన్‌మెన్‌తో మాట్లాడేందుకు సర్పంచ్ ప్రయత్నించారు.
కాగా, అతను ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో, ఏఈకి కూడా ఫోన్ చేశారు. అది కూడా స్విచాఫ్‌లోనే ఉన్నట్లు సమాధానం రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు విద్యుత్ అధికారులు వచ్చేవరకు అక్కడి నుంచి కదలమని రోడ్డుపై బైఠాయించారు.
బిల్లుల వసూలుపై చూపే శ్రద్ధ సరఫరాలో ఎందుకు చూపరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బక్రీద్ పండుగకు మాత్రమే కరెంటు పోతుందా అంటూ ఆగ్రహించారు. ఒక దశలో సబ్‌స్టేష న్‌లో పనిచేసే సిబ్బందిని బయటకు పంపి వేశారు. వందల సంఖ్యలో గ్రామస్తులు సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చ చెప్పి రాస్తారోకో విరమింపజేశారు.
విద్యుత్ కోతకు నిరసనగా రాస్తారోకో
Published Thu, Oct 17 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement