‍ప్రేమోన్మాది చేతిలో యువతి హతం  | Person Murder Lover And Also Lost His Life In Sivamogga Karnataka | Sakshi
Sakshi News home page

‍ప్రేమోన్మాది చేతిలో యువతి హతం 

Published Sat, Aug 28 2021 7:33 AM | Last Updated on Sat, Aug 28 2021 7:47 AM

Person Murder Lover And Also Lost His Life In Sivamogga Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివమొగ్గ: తన ప్రేమను అంగీకరించలేదని యువతిని హత్య చేసిన యువకుడు ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శివమొగ్గ జిల్లా, హోసనగర తాలూకాలో చోటు చేసుకుంది. హోసనగర తాలూకా, రిప్పన్‌పేట సమీపంలోని కగ్గళి గ్రామానికి చెందిన శివమూర్తి(23) శివమొగ్గ జిల్లా సాగర తాలూకా కార్గల్‌ గ్రామ సమీపంలోని కనూరు గ్రామానికి చెందిన కవితను (22)ను ఇష్టపడ్డాడు. అయితే అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు.

దీంతో ఈ నెల 25న బెళ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నరిగా అటవీ ప్రాంతంలో హోసకెరె చెరువు వద్దకు కవితను తీసుకెళ్లి చున్నీతో గొంతు బిగించి హత్య చేసి విషం సేవించాడు.  స్థానికులు ఇచ్చిన సమాచారంతో సాగర  పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే కవిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన ఊపిరితో ఉన్న శివమూర్తి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడని పోలీసులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement