శివమొగ్గ: కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్‌బీఎఫ్) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జూన్ నెలలోనే సుమారు 51 మంది ఈ జ్వరానికి గురయ్యారని చెప్పారు.
ఏమిటీ ఎలుక జ్వరం
రెండు రకాల బ్యాక్టీరియా వల్ల ఎలుక జ్వరం సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన ఎలుకలు, పందికొక్కులు వంటి జీవులు మనిషిని కరిచినా, లేదా అవి కొరికిన పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తిన్నా ఈ జబ్బు వ్యాపించే ప్రమాదముంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, కొందరిలో కీళ్ల వాపు, దద్దుర్లు ఈ జ్వరం లక్షణాలు. చలి–జ్వరం విడిచి విడిచి వస్తుంటుంది. వైద్యులను కలిసి యాంటి బయాటిక్స్ చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ జ్వర పీడితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. పరిసరాల్లో ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలి.
చదవండి: (అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు)
Comments
Please login to add a commentAdd a comment