Monkey Fever
-
Monkey Fever: మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో రెండు మరణాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివరాల ప్రకారం.. మంకీ ఫీవర్‌తో కర్ణాటకలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ మృతిచెందారు. జనవరి 8న సదరు యువతి చెందింది. ఇక, ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ వెల్లడించారు. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు
శివమొగ్గ: కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్బీఎఫ్) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జూన్ నెలలోనే సుమారు 51 మంది ఈ జ్వరానికి గురయ్యారని చెప్పారు. ఏమిటీ ఎలుక జ్వరం రెండు రకాల బ్యాక్టీరియా వల్ల ఎలుక జ్వరం సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన ఎలుకలు, పందికొక్కులు వంటి జీవులు మనిషిని కరిచినా, లేదా అవి కొరికిన పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తిన్నా ఈ జబ్బు వ్యాపించే ప్రమాదముంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, కొందరిలో కీళ్ల వాపు, దద్దుర్లు ఈ జ్వరం లక్షణాలు. చలి–జ్వరం విడిచి విడిచి వస్తుంటుంది. వైద్యులను కలిసి యాంటి బయాటిక్స్ చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ జ్వర పీడితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. పరిసరాల్లో ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలి. చదవండి: (అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు) -
Monkey Fever: మంకీ ఫీవర్ ఎలా సోకుతుందో తెలుసా?
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. కానీ, కేరళలో మాత్రం కేసుల ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు మంకీ ఫీవర్ కలకలం మొదలైంది. అయితే ఈ విషయంలో అపోహలు వద్దని చెప్తున్నారు వైద్యులు. కేరళలో మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. కాగా, గత నెలలో కర్ణాటకలోనూ ఓ కేసు నమోదైంది. వయనాడు జిల్లాలోని గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ఇటీవల జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతడిలో మంకీ ఫీవర్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో శాంపిల్స్ సేకరించి.. పరీక్షకు పంపగా మంకీ ఫీవర్‌గా నిర్ధారణ అయింది. బాధిత యువకుడికి ప్రస్తుతం మనంతవాడీ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ)నే మంకీ ఫీవర్‌గా పిలుస్తుంటారు. సీజనల్ ఫీవర్‌గా ఇది వస్తుందని వైద్యులు చెప్తున్నారు. మంకీ ఫీవర్ విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. అయితే ఈ ఫీవర్ అంత ప్రమాదకరమైంది కాదనేది వైద్య నిపుణుల మాట. మంకీ ఫీవర్.. టిక్-బార్న్(పేన్ల) వైరల్ హెమరేజిక్ జ్వరం. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది, ఇందులో కోతుల ద్వారా సంక్రమించే యెల్లే ఫీవర్, డెంగ్యూ జ్వరం కూడా ఉన్నాయి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులుగా ఉండటం దీని లక్షణాలు. కొంతమందిలో డెంగీ జ్వరానికి ఉండే లక్షణాలను కలిగి ఉంటుంది. మంకీ ఫీవర్ కారణంగా 5 నుంచి 10 శాతం మరణించే అవకాశం కూడా ఉంది. చనిపోయిన కోతుల నుంచి తాకడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.మనిషి ద్వారా మనిషికి సంక్రమించిన కేసులైతే ఇప్పటిదాకా నమోదు కాలేదు. -
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా కర్ణాటకలో మంకీ ఫీవర్ మరోసారి కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది. -
కర్ణాటకలో మంకీ ఫీవర్.. తొలి కేసుగా నమోదు
సాక్షి, యశవంతపుర: కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పుర తాలూకా సీతూరు జీపీ పరిధిలోని బెమ్మనెలలో ఒకరికి మంకీ ఫీవర్ (కోతి జ్వరం– కేఎఫ్‌డీ) సోకింది. ఇది మొదటి కేసుగా గుర్తించారు. బాధితునికి కరోనా పాజిటివ్ రావటంతో మరిన్ని పరీక్షలు చేయగా మంకీ ఫీవర్‌గా గుర్తించారు. తీర్థహళ్లి తాలూకా అరగలో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన్నట్లు గుర్తించారు. రోగిని ఉడుపి వద్దనున్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి తదితరాలు ఈ జబ్బు లక్షణాలు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. కోతుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. -
ఓవైపు కరోనా.. మరో వైపు కోతి జ్వరం
కర్ణాటక,బనశంకరి: రాష్ట్రంలో ఓవైపు కరోనా విజృంభిస్తుండగా మరో వైపు కోతి జ్వరం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించింది. సుమారు 200 కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఉత్తరకన్నడ జిల్లా సిద్దాపుర తాలూకాలోని కూలర్క గ్రామంలో 41 కేసులు వెలుగుచూశాయి. చిక్కమంగళూరులో 10, శివమొగ్గ జిల్లాలో 146 కేసులు వెలుగు చూశాయి. (ఇండియన్ నేవీలో కరోనా కలకలం!) -
మరో భయం..కోతి జ్వరం
కర్ణాటక, యశవంతపుర: ఒకవైపు ప్రపంచం మొత్తాన్ని చైనా కరోనా వైరస్ బీభత్సానికి గురిచేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మలెనాడు ప్రాంతంలో కోతి జ్వరం (మంకీ ఫీవర్) మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ముగ్గురికి ఈ వైరస్ సోకింది. వైరస్ కేసులు రోజురోజు వ్యాపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. చిక్కమగళూరు జిల్లావ్యాప్తంగా కెఎఫ్‌డి (క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్) అలియాస్ కోతి జ్వరం వైరల్‌గా మారింది. సుమారు రెండేళ్ల కిందట పలు తాలూకాల్లో ఈ వ్యాధి ప్రబలడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు జడలు విప్పుతోంది. లక్షణాలు ఇవీ తీవ్రమైన జ్వరం, తల నొప్పి, ముక్కు, నోట్లోంచి రక్తం కారడం, వాంతులు, కండరాలు పట్టేయడం,ఒళ్లు నొప్పులు, వణకడం, మానసిక వ్యాకులత వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స తీసుకుంటే రెండువారాల్లో తగ్గిపోతాయి. కానీ ఒళ్లునొప్పులు కొన్ని నెలలపాటు వెంటాడుతాయి. గ్రామాల్లో వైద్య శిబిరాలు అసోం నుంచి వచ్చిన వలస కూలీ కార్మికులకు సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఎన్ఆర్ తాలూకా మడబూరు గ్రామంలో కాఫీ తోటలో పని చేస్తున్న 60 మంది అసోం కూలీల్లో ముగ్గురికీ సోకింది. దీనితో జిల్లావ్యాప్తంగా నివారణ చర్యలను చేపట్టారు. మడబూరుకు ఐదు కిలోమీటర్ల పొడవునా క్రిమి సంహారక మందులను చల్లుతున్నారు. ఈ తరుణంలో ఎన్ఆర్ పురతో పాటు కొప్ప, శృంగేరి, మూడిగెరె గ్రామీణ భాగాలలో వైద్యులు సంచార వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఒకరకమైన జ్వరంతో మరణించిన కోతుల ద్వారా ఈ జబ్బు మనుషులకు సోకుతోందని వైద్యాధికారులు గుర్తించారు. చిన్న పిల్లలకు సోకకుండా అధికారులు కెఎఫ్‌డీ రోగ నిరోధక చుక్కలను వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయపడవలసిన పని లేదని జిల్లా మంత్రి సీటీ రవి తెలిపారు. ఆయన మంగళవారం అధికారులతో సమీక్షను నిర్వహించారు. వైరస్ వ్యాపించకూండ జిల్లా యంత్రం అన్ని చర్యలు తీసుకొంటుందని, ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
వణుకుతోన్న మలెనాడు
పచ్చని అడవులు, మేఘాలను తాకేఎత్తైన పర్వతాలు, లోతు ఎంతో తెలియని లోయలు, కాఫీ తోటలు.. ఇలా ఎన్నెన్నో అందాలతో మైమరిపించే మలెనాడు ఇప్పుడ ప్రకృతి విపత్తుల గుప్పిట్లోచిక్కుకుంది. మనిషి స్వార్థం ఈ సుందర ప్రాంతం భవితను అగమ్య గోచరంచేసింది. ప్రతి ఏటా వేలాది ఎకరాల్లోఅడవులను కొట్టి తోటలు, ఇళ్లునిర్మించడం, భూ పరిరక్షణనుగాలికొదిలేయడం తదితర చర్యలతో ప్రకృతి మాత క్షోభిస్తోందా అన్నట్లు తరచూ విపత్తులు పలకరిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: గతేడాది అకాల వర్షాలు, అతివృష్టితో మలెనాడు (హాసన్, శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, కొడగు, ఉడుపి జిల్లాలు) ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయింది. ఇటీవల కాలంలో మంకీ ఫీవర్ రూపంలో మరోసారి ముప్పు వాటిల్లింది. ఇక ఇదే క్రమంలో గత రెండు, మూడు రోజుల నుంచి మలేనాడు ప్రాంతంలోని శివమొగ్గ జిల్లా వాసులను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత రెండు రోజుల క్రితం శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి–హోసనగర తాలూకా సరిహద్దు భాగాల్లో భూమి కంపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. సోమవారం మళ్లీ ప్రకంపనలు ఈ నెల 2న అర్ధరాత్రి 1.33 గంటలకు హోసనగర, తీర్థహళ్లి తాలూకా సరిహద్దులో స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. పశ్చిమ ఘాట్ ప్రాంతంలో ఎదురవుతున్న ప్రమాదాలకు ఇవి ముందస్తు హెచ్చరికలగా భావించవచ్చనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీర్థహల్లి తాలూకాలో మాణి జలశయం సమీపంలో విఠల నగర వద్ద భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భారీ భూకంపమే వస్తే? విఠల నగర ప్రాంతంలోనే వారాహి, మాణి, సావేహళ్లు, శరావతి జలాశయాలు ఉన్నాయి. ఈ క్రమంలో భూకంపం తీవ్రత పెరిగితే నష్టం అంచనాలకు అందకపోవచ్చు. విఠల నగరలో మూడో సారి భూకంపం రావడం గమనార్హం. గతంలో 1843లో ఏప్రిల్ 1న రిక్టర్ స్కేల్‌పై 5 స్థాయిలో, 1975లో మే 12న 4.7 స్థాయిలో భూకంపాలు సంభవించాయి. 2010లోనే నిపుణుల హెచ్చరిక పశ్చిమ ఘాట్ పరిధిలో శరావతి లోయ సున్నిత ప్రాంతం. ఇక్కడ నేల పొరలు పొరలుగా నిర్మితమైంది. దీంతో భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక సంఖ్యలో జలాశయాలు ఉండడం, మనిషి పట్టణీకరణ కోసం అడవులను నాశనం చేయడం వల్ల ప్రకృతి కోపానికి కారణమవుతోందని 2010లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. భారతీయ విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలు శరావతి లోయలో అధ్యయనం చేసి భూకంపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని నివేదిక సమర్పించారు. ఈ ప్రాంతంలోని అడవులను నాశనం చేయడంతో పాటు, చాలా ఆనకట్టలు అపాయకర స్థితిలో ఉన్నాయని హెచ్చరించారు. భూమి లోపల ఫలకాలు స్థానభ్రంశం చెందే అవకాశం ఉందని, వాటి వల్ల భూకంపాలు సంభవిస్తాయని 2010లో హెచ్చరికలు పంపారు. అలాగే అగ్నిప్రమాదాలు కూడా జరుగుతాయని సూచించారు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపారు. -
మంకీ ఫీవర్ పంజా
బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి జంతువులకు, వాటి నుంచి మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వ్యాప్తిని అరికట్టడానికి చిక్కమగళూరు జిల్లాలో ఏకంగా పర్యాటకుల రాకను నిషేధించారు. సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పలుజిల్లాల్లో మంకీ ఫీవర్ (కోతి జ్వరం) వ్యాపిస్తోంది. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ తదితర మల్నాడు జిల్లాల్లో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక విదేశీ పర్యాటక మహిళకు సోకింది. ఇప్పటికే పదిమంది వరకూ బలి తీసుకున్న మంకీ ఫీవర్ ఉత్తర కన్నడ జిల్లా పర్యాటకానికి వచ్చిన నేపాల్ మహిళకు వ్యాపించింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుమాటాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. పై జిల్లాల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా వైరస్ సోకింది. మరోవైపు మంకీ ఫీవర్ విస్తరించకుండా చిక్కమగళూరు జిల్లాలో పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. మంకీ ఫీవర్ అంటే? గతేడాది డిసెంబర్ నెలలో శివమొగ్గ జిల్లాలో ఈ మంకీ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. తొలుత 1957లో ఒక కోతిలో ఈ వైరస్‌ను గుర్తించారు. శివమొగ్గ జిల్లా సొరబ తాలూకాలోని క్యాసనూరు గ్రామంలో తొలుత ఈ మంకీ ఫీవర్‌కు కారణమైన వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ వైరస్‌కు క్యాసనూర్ అని పేరు పెట్టారు. ఈ వైరస్ సోకిన కోతి నుంచి మానవులకు అంటుకుంటోంది. కోతుల్లోని ఈ వైరస్ గాలి ద్వారా పశువులకు, మనుసులకు సోకుతుంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇవీ లక్షణాలు ♦ వైరస్ సోకిన తర్వాత ఒక వారం వరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ♦ వారం తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత, కండరాల తిమ్మిరి, వాంతులు కనిపిస్తాయి. ♦ వ్యాధి తీవ్రతరమయ్యాక నోరు, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. ♦ బీపీ, ఎర్ర రక్తకణాలు బాగా తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ♦ వ్యాధి ముదిరితే మతిస్థిమితం కోల్పోవచ్చు. ♦ ఈ వ్యాధి వస్తే మరణించే అవకాశాలు 3–5 శాతం ఉంటాయి. -
గోవాను వణికిస్తున్న కోతి రోగం..
పనాజీ: గోవాని కోతి రోగం హడలెత్తిస్తోంది. గత సంవత్సర కాలంలో 35 మందికి ఈ వ్యాధి సోకినట్లు వాల్పోయ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి తెలిపారు. క్యాసనూర్ ఫారెస్ట్ డీసీస్ (కేఎఫ్‌డీ)గా పిలబడే ఈ వ్యాధి బారిన పడి తీర ప్రాతం సత్తారి తాలుకాలో 2015లో ఒకరు, 2016 లో ఇద్దరు మరణించారు. ఏడాది కాలంలో కేఎఫ్‌డీ బారినపడ్డ 35 మంది సత్తారి తాలుకా కు చెందిన వారేనని ఆయన వెల్లడించారు. అయితే ఆరోగ్య శాఖ చేపట్టిన వ్యాక్సినేషన్ చర్యల వల్ల వ్యాధికి గురైన ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అన్నారు. కోతుల శరీరం పైన ఉండే సూక్ష్మ క్రిముల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. కోతులతో సావాసం చేయడం వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కర్ణాటకలోని క్యాసనూర్ అడవిలో 1957లో ఈ వ్యాధిని గుర్తించారని వివరించారు. అందువల్లే ఈ వ్యాధిని ‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీస్’ గా పిలుస్తున్నారని అన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, రక్తస్రావం ఈ వ్యాధి లక్షణాలు. డెంగ్యూని పోలిన లక్షణాలతో కేఎఫ్‌డీ మరణానికి దారితీస్తుందని చెప్పారు. -
కోతుల నుంచి వచ్చే జ్వరం... ‘మంకీ ఫీవర్’!
మెడి క్షనరీ వాడుకభాషలో ‘కోతుల జ్వరం’ లేదా క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ) అని పిలిచే ఈ జబ్బు కోతుల మీద నివసించే పేల వంటి ఒక రకం క్రిముల ద్వారా మనుషులకు వస్తుంది. కోతులపై ఉండే ఈ క్రిములు మనుషుల్ని కుట్టడం వల్ల ఇది మనుషులకు వస్తుంది. దీన్ని మొట్టమొదటిసారి 1957లో కర్ణాటకలోని ‘క్యాసనర్ ఫారెస్ట్’ అనే అడవిలో కనుగొన్నారు. కాబట్టి దీన్ని క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ అంటారు. ఈ జ్వరాన్ని తెచ్చే వైరస్ కూడా డెంగ్యూను వ్యాపింపజేసే ‘ఫ్లావివిరిడే’ కుటుంబానికి చెందినదే. కర్ణాటకలోని షిమోగా ప్రాంతంలో మంకీ ఫీవర్ వ్యాప్తి ఉంది. ఇక కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో గల అటవీ ప్రాంతంలో గత మూడేళ్ల నుంచి వరసగా ఈ వ్యాధి కనిపిస్తోంది.