
సాక్షి, బెంగళూరు: కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వివరాల ప్రకారం.. మంకీ ఫీవర్‌తో కర్ణాటకలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ మృతిచెందారు. జనవరి 8న సదరు యువతి చెందింది. ఇక, ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ వెల్లడించారు. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment