
కర్ణాటక: ఓ ఇంట్లోని మరుగుదొడ్లో నాగుపాము ప్రత్యక్షమయింది. ఈ ఘటన శివమొగ్గ నగరానికి సమీపంలో ఉన్న శివప్పనాయక లే ఔట్‌లో చోటుచేసుకుంది. ఇంట్లోని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లగా.. అక్కడ పాము కనిపించడంతో బయటకు పరుగులు పెట్టాడు. అయితే బయట నుంచి మరుగుదొడ్లోకి వచ్చిన నాగుపాముకు అక్కడ నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాలేదు. దాంతో అందులోనే ఉండిపోయింది. అనంతరం ఇంటి సభ్యులు వెంటనే స్నేక్ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతను వెంటనే అక్కడకు చేరుకుని నాగుపామును బంధించి సురక్షితంగా అడవిలో వదిలాడు.
చదవండి: (MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్ నడిరోడ్డుపై కారు ఆపి..)