
శివమొగ్గ: ఆన్‌లైన్ మోసాల గురించి తరచూ వార్తలు వస్తున్నా అమాయకులు జాగృతం కావడం లేదు. తాజాగా ఓ యువతి డబ్బు మోసపోయింది. భద్రావతి తాలూకా హిరియూరుకు చెందిన సారికకు 3 నెలల కిందట ఫిలిప్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. వారం కిందట సారిక కు ఫోన్ చేసి నీకు స్పెయిన్ నుంచి ఖరీ దైన బహుమతులను పంపించానని, ఢి ల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారని చె ప్పాడు. ఫీజుల కోసం డబ్బు పంపాలని కోరగా, సారిక రూ.1.85 లక్షలను అతని ఖాతాలకు పంపించింది. ఆ వెంటనే ఫిలిప్ ఫోన్ స్విచాఫ్ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment