భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులతో భర్త పార్టీ.. మద్యం మత్తులో | karnataka: Man Assassinated By Friends After Drink Alcohol | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులతో భర్త పార్టీ.. మద్యం మత్తులో

Published Sat, Dec 25 2021 10:29 AM | Last Updated on Sat, Dec 25 2021 10:41 AM

karnataka: Man Assassinated By Friends After Drink Alcohol - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివమొగ్గ: ముగ్గురు స్నేహితులు ఇంటిలో పార్టీ చేసుకుని మద్యం మత్తులో గొడవపడి ఒకరిని హతమార్చి శవాన్ని చెరువులో పడేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా రిప్పన్‌పేట సమీపంలోని గరతికెరె గ్రామంలో చోటు చేసుకుంది. హతుడిని గ్రామానికి చెందిన సతీశ్‌ (32)గా గుర్తించారు. భార్య పుట్టింటికి వెళ్లడంతో సతీశ్‌ బుధవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నారు.

మద్యం మత్తులో గొడవలు జరిగాయి. స్నేహితులు సతీశ్‌ను చాకుతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలోని చెరువులో పడేశారు. గురువారం సాయంత్రం పొద్దుపోయిన తరువాత మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement