
తల్లితండ్రులు శివకుమార్, ఆశాలతో ఇంద్రజిత్
శివమొగ్గ: ఎన్నికలు, ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న శివమొగ్గ జిల్లా కలెక్టర్ అందుకు రాయబారిగా విశేషమైన వ్యక్తిని ఎంచుకున్నారు. శివమొగ్గ నగరంలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడిని ఎన్నికల ప్రచారాలకు రాయబారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కలెక్టర్ లోకేశ్ మీడియాతో మాట్లాడారు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఒకటవ తరగతి చదువుతున్న ఇంద్రజిత్‌ను ఈసారి జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించినట్లు కలెక్టర్ లోకేశ్ తెలిపారు.
తల పండిన రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీ నేతలు సైతం చెప్పడం కష్టతమైన రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల పేర్లను నిమిషం వ్యవధిలో ఎటువంటి తడబాటు లేకుండా చెప్పగలిగే ఇంద్రజిత్‌ను ఎన్నికల ప్రచారకర్తగా నియమించడానికి నిర్ణయించినట్లు చెప్పారు. తన వయసు కేవలం ఆరు సంవత్సరాలైన కారణంగా ఓటేయాలనే ఆకాంక్ష ఉన్నా నేరవేరడం సాధ్యం కాదని అందుకే ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఇంద్రజిత్ తెలపడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment