
మైసూరు: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప కొడుకు విజయేంద్రకు పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆవేదన చెందిన ఇద్దరు కార్యకర్తలు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు పోటీగా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను వరుణ స్థానం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచించింది. దీంతో విజయేంద్ర నియోజకవర్గంలో రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే అధిష్టానం చివరి నిమిషంలో విజయేంద్రకు మొండిచేయి చూపింది. దీంతో గర్గేశ్వరినికి చెందిన హెళవరహుండి గూళప్ప, సరగూరుకు చెందిన బసవణ్ణలు ఆవేదన చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకున్నారు.