మైనర్‌ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో.. | Thugs Molested Minor Student, Posted Videos On Internet Shivamogga | Sakshi
Sakshi News home page

మైనర్‌ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో..

Published Mon, Jan 24 2022 7:41 AM | Last Updated on Mon, Jan 24 2022 8:32 AM

Thugs Molested Minor Student, Posted Videos On Internet Shivamogga - Sakshi

శివమొగ్గ (కర్ణాటక): మైనర్‌ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్టు చేసిన దుండగులను హొసనగర పోలీసులు అరెస్టు చేశారు. వారంబళ్లికి చెందిన సునీల్, ఆయనూరు గ్రామానికి చెందిన సంతోష్‌లు మైనర్‌ బాలికపై అత్యాచారం చేశారు. సచిన్, సుబ్బ, రఘు అనే వ్యక్తులు వారికి సహకరించారు. ఈ ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సునీల్, సంతోష్‌లు సదరు మైనర్‌ బాలికకు పరిచయస్తులు. ఇటీవల హొసనగర పట్టణంలోని బస్టాండ్‌లో ఊరికి వెళ్లేందుకు బాలిక వేచిచూస్తోంది. ఈ సమయంలో కారులో వచ్చిన నిందితులు ఇంట్లో దింపుతామని నమ్మించి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి పోస్ట్‌ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృగాళ్లను అరెస్టు చేశారు.  

పసిమొగ్గపై కిరాతకం
యశవంతపుర: చిన్నారిపై దారుణం చోటుచేసుకుంది. నందిని లేఔట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో బాలిక (8) తల్లి పనికి వెళ్లిన సమయంలో శనివారం రాత్రి 7 గంటలప్పుడు పక్క ఇంటిలో ఉండే యువకుడు అత్యాచారం చేశాడు. తల్లి ఇంటికి వచ్చిన తరువాత బాలిక విషయం చెప్పగా, నందినిలేఔట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు.  

చదవండి: (ఇంటర్‌ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement