శివమొగ్గ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. శివమొగ్గలో సోనియాపై కేసు రిజిస్టర్ అయింది. వివరాల్లోకి వెళితే.. పీఎం కేర్స్ ఫండ్‌పై మే 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్లు సోనియా గాంధీ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చినట్లు తేలింది. దీంతో సోనియాపై కర్నాటకలో ఐపీసీ 153, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌ను అడ్వకేట్ ప్రవీణ్ కేవీ రిజిస్టర్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ఫ్రాడ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రజలకు వినియోగించడం లేదని, ఆ సొమ్ముతో ప్రధాని మోదీ విదేశీ టూర్లకు వెళ్లనున్నట్లు ఆరోపించారన్నారు. అంతేగాక కోవిడ్-19 కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దురుద్ధేశమైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పుకార్లు పుట్టించిందన్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ప్రవీణ్ తెలిపారు.
కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ
Comments
Please login to add a commentAdd a comment