ప్రేమలో కూతురు మోసపోయిందని తండ్రి.. | daughter love tragedy.. father commits suicide in shivamogga | Sakshi
Sakshi News home page

ప్రేమలో కూతురు మోసపోయిందని తండ్రి..

Published Sun, Apr 16 2017 9:52 PM | Last Updated on Thu, Aug 16 2018 4:22 PM

ప్రేమలో కూతురు మోసపోయిందని తండ్రి.. - Sakshi

ప్రేమలో కూతురు మోసపోయిందని తండ్రి..

శివమొగ్గ: కూతురి ప్రేమ వ్యవహారం ఓ తండ్రి బలవన్మరణానికి కారణమైంది. ప్రియుడి చేతిలో మోసపోయి, తండ్రిని కోల్పోయిన ఆ అమ్మాయి పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. బెంగుళూరులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

దన్యనాయక్‌ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి శివమొగ్గలో నివాసం ఉంటున్నాడు. అతని కూతురికి, అదే ప్రాంతంలో నివసించే మంజునాయక్‌ అనే యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. విషయం తెలుసుకున్న దన్యా నాయక్‌.. ఇద్దరికీ పెళ్లిచేయాలని నిశ్చియించాడు. ఈ క్రమంలోనే గ్రామస్తుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే నిశ్చితార్దం అనంతరం మంజునాయక్‌ ఊరువిడిచి పారిపోయాడు.

అలా వెళ్లిపోయిన మంజునాయక్‌.. వేరొక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో దన్యానాయక్‌కుటుంబానికి షాక్‌ తగిలినట్లయింది. నిశ్చితార్ధం చేసుకున్నాక వేరే అమ్మాయిని ఎలా పెళ్లాడతారని దన్యా పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో మంజునాయక్‌పై శివమొగ్గ మహిళ పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అయితే, ఇటీవలే జైలు నుంచి విడుదలైన మంజునాయక్‌.. ’మిమ్మల్ని అంతం చేస్తా’నంటూ దన్యనాయక్‌ కుటుంబాన్ని బెదిరించాడు. బెదిరిపోయిన ధన్యనాయక్‌ శనివారం రాత్రి ఇంటి వెనుక ఉన్న చెట్టుకు ఉరేసుకోని అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ప్రియుడి చేతిలో మోసపోయిన దన్యానాయక్‌ కుమార్తె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంజునాయకుతో తనకు వివాహం జరిపిస్తానని మహిళ ఇన్స్‌పెక్టర్‌ ప్రభావతి 20 వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపించింది. పోలీసులు సరిగా వ్యవహరించిఉంటే తండ్రి చనిపోయేవాడుకాదని కన్నీళ్లు పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement