బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజులే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శివమొగ్గలో భారీ ర్యాలీ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఆ బహిరంగ సభలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ సందడి చేశారు. తాను రాహుల్ గాంధీకి పెద్ద అభిమానినని, ఆయనతో పాటు ర్యాలీకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.
'నేను ఇక్కడికి రాహుల్ గాంధీ అభిమానిగా వచ్చా. ఆయన ఇటీవలే భారత్ జోడో యాత్రలో దేశమంతా పాదయాత్ర చేశారు. ఆ యాత్ర నుంచి చాలా స్ఫూర్తి పొందా.' అని శివరాజ్ కుమార్ తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేరింతలు, చప్పట్లతో సభను మారుమోగించాయి.
Rahul Gandhi and legendary actor Shiva Rajkumar campaigned for Congress in Karnataka. 🔥 pic.twitter.com/JAfvxj7LxO
— Shantanu (@shaandelhite) May 2, 2023
కాగా.. శివరాజ్ కుమార్ సతీమణి గీత శివ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్‌కు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విషయమే అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
మరోవైపు బీజేపీ తరఫున కన్నడ సీనియర్ హీరోలు కిచ్చ సుదీప్, దర్శన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం బొమ్మైతో కలిసి వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వీరు కమలం పార్టీలో అధికారికంగా చేరలేదని, వారి వల్ల తమకు ఎలాంటి నష్టం ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి..
Comments
Please login to add a commentAdd a comment