పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం అందరికీ తెలిసిన సమస్యే! రసాయనాల ప్రభావం ఉందని వాటిని తినడం మానుకోలేం కదా! మరి పరిష్కారం ఏమిటంటే? వీలైనంత వరకు వాటిని శుభ్రంగా కడుక్కోవడమేనని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు అంతకు మించిన పరిష్కారమే అందుబాటులోకి వచ్చింది.
పండ్లు, కూరగాయలకు ఒక వాషింగ్ మెషిన్ ప్రత్యేకంగా రూపొందింది. దక్షిణ కొరియాకు చెందిన సియింఘో స్టూడియోకు చెందిన డిజైనర్లు ‘ఒయాసిస్’ పేరుతో ఈ పండ్లు, కూరగాయల వాషింగ్ మెషిన్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించారు.
ఇది అల్ట్రాసోనిక్ వాషింగ్ మెషిన్. పండ్లు, కూరగాయలను ఇందులో వేసి, ఆన్ చేసుకుంటే, దీనిలో వెలువడే అల్ట్రసోనిక్ తరంగాలు వాటిపైన ఉండే ప్రమాదకర రసాయనాలను నిర్వీర్యం చేస్తాయి. ఇందులో వేసి, శుభ్రం చేసుకున్నాక పండ్లు, కూరగాయలు తినడానికి పూర్తి సురక్షితంగా తయారవుతాయి. దీనిని ఇంకా మార్కెట్‌లోకి విడుదల చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment