
జావెలిన్ త్రో, డిస్కస్ త్రో తెలుసు... ఈ వాషింగ్ మెషీన్ త్రో ఏంటనుకుంటున్నారా? నిజమే వాషింగ్ మెషీన్‌ను ఎత్తి విసిరేయడమే. అలా 14 అడుగుల 7 అంగుళాల దూరానికి విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడో స్వీడిష్ వ్యక్తి. ఇంట్లో ఓ పక్క ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఇంకోపక్కకు జరపాలంటే కష్టం. అలాంటిది అలా ఎలా విసిరాడు? అందరికీ వచ్చే సందేహమే. ఆయనొక్కడే కాదు... అంతకుముందు 13 అడుగుల 6.6 అంగుళాలు, 14 అడుగుల 1 అంగుళం దూరాలు విసిరిన రికార్డులున్నాయి.
తాజాగా మిలన్‌లో జరిగిన పోటీలో స్వీడన్‌కు చెందిన జోహన్ ఎస్పెన్‌రోనా.. వాషింగ్ మెషీన్‌ను 14 అడుగుల 7 అంగుళాల దూరం విసిరి వాళ్లిద్దరి రికార్డులను బ్రేక్ చేశాడు. అయితే దీనికి స్ఫూర్తి... పేపర్ ప్లేన్ గిన్నిస్ రికార్డ్. అదే చిన్నపిల్లలు పేపర్‌ఫ్లైట్ తయారు చేసి ఒకరిమీదకు ఒకరు విసురుకుంటారు కదా. అలా చిన్న పిల్లల్లా మారిపోయిన దక్షిణ కొరియాకు చెందిన ఓ ఇద్దరు, మలేసియాకు చెందిన ఒకరు, మొత్తం ముగ్గురు కలిసి... పేపర్ ప్లేన్ తయారు చేశారు. 252 అడుగుల 7 అంగుళాల దూరం ప్రయాణించేలా విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment