ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకులు అవినీతిపరులంటూ ఆరోపించిన మోదీ ఇప్పుడు ఆదే నాయకులను ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.
బీజేపీ వాషింగ్ మెషీన్ మళ్లీ పని చేస్తోందని, ఇన్‌కంట్యాక్స్, సీబీఐ, ఈడీ(ఐసీఈ) అనే సబ్బుతో అవినీతిపరులను పరిశుద్ధులను చేస్తోందని ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్ని మరకలను చిటికెలో తొలగిస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో ‘మోదీ వాషింగ్ పౌడర్’ చిత్రాన్ని జైరామ్ రమేశ్ షేర్ చేశారు. విపక్షాల కూటమి ఏర్పాటు కాకూడదని కోరుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.
Yesterday when the BJP Washing Machine restarted in Mumbai with its ICE (Incometax, CBI, ED) detergent, BJP-inspired obituaries on Opposition unity were being planted. The obit writers will be disappointed. The next meeting of the parties that met at Patna on June 23rd will be… pic.twitter.com/LqdwRSg7CO
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 3, 2023
Comments
Please login to add a commentAdd a comment