washing powder
-
పొలిటికల్ సెటైర్: మోదీ వాషింగ్ పౌడర్.. మరకలు చిటికెలో మాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకులు అవినీతిపరులంటూ ఆరోపించిన మోదీ ఇప్పుడు ఆదే నాయకులను ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ వాషింగ్ మెషీన్ మళ్లీ పని చేస్తోందని, ఇన్‌కంట్యాక్స్, సీబీఐ, ఈడీ(ఐసీఈ) అనే సబ్బుతో అవినీతిపరులను పరిశుద్ధులను చేస్తోందని ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్ని మరకలను చిటికెలో తొలగిస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో ‘మోదీ వాషింగ్ పౌడర్’ చిత్రాన్ని జైరామ్ రమేశ్ షేర్ చేశారు. విపక్షాల కూటమి ఏర్పాటు కాకూడదని కోరుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. Yesterday when the BJP Washing Machine restarted in Mumbai with its ICE (Incometax, CBI, ED) detergent, BJP-inspired obituaries on Opposition unity were being planted. The obit writers will be disappointed. The next meeting of the parties that met at Patna on June 23rd will be… pic.twitter.com/LqdwRSg7CO — Jairam Ramesh (@Jairam_Ramesh) July 3, 2023 -
నల్లవాళ్లను తెల్లగా ఇలా మారుస్తారా?
ప్రకటనలు ఇవ్వడం అంటే.. వినియోగదారులను తమ ఉత్పత్తుల వైపు ఆకట్టుకోవడమే. కానీ, అందులో అతి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయం చైనాలోని ఓ లాండ్రీ డిటర్జెంట్ కంపెనీ ప్రకటనతో మరోసారి రుజువైంది. జాతి దురహంకారానికి ప్రతీకగా కనిపిస్తున్న ఈ ప్రకటనపై ఇప్పటికే సోషల్ మీడియాలో జనం భగ్గుమంటున్నారు. చైనాలోని కియోబీ అనే లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ఇటీవలే ఈ ప్రకటన విడుదల చేసింది. ఓ యువతి దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మిషన్ వద్దకు వచ్చినప్పుడు.. ఆమెకు ఓ నల్లటి యువకుడు కన్నుకొడతాడు. ఆమె అతడిని దగ్గరకు పిలుస్తుంది. ముద్దు ఇవ్వడానికి పిలిచిందేమోనని ఆశగా ముందుకొచ్చిన ఆ యువకుడిని ఊరిస్తూ నెమ్మదిగా వాషింగ్ మిషన్‌లోకి తోసేసి దాని పైకెక్కి నవ్వుతూ కూర్చుంటుంది. కాసేపటి తర్వాత వాషింగ్ మిషన్ మూత తీసి చూస్తే.. అతడు తెల్లటి చైనీస్ వ్యక్తిలా మారిపోతాడు. చైనా టీవీలో ఈ ప్రకటన ఈ నెలలోనే ప్రసారమైంది. కొన్ని థియేటర్లలో కూడా ఇది రావడంతో వెంటనే ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఇది చాలా జాత్యంహకార పూరితంగా ఉందని జనం భగ్గుమంటున్నారు. ప్రధానంగా ఆఫ్రికా జాతులకు చెందినవాళ్లను కించపరిచే ఇలాంటి ప్రకటనలను ఎలా ఇవ్వనిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంతకుముందు 2007లో ఒక ఇటాలియన్ కంపెనీ కూడా ఇలాంటి ప్రకటనే ఇచ్చిందట. అయితే అప్పట్లో తెల్లటి వ్యక్తి నల్లగా మారిపోతాడు. కొత్త స్టార్ వార్స్ సినిమా పోస్టర్లలో కూడా అమెరికాలో అయితే నల్లజాతి నటుడు జాన్ బోయెగా ప్రముఖంగా కనిపిస్తాడు. కానీ చైనాలోని పోస్టర్లలో మాత్రం అతడిని అంతగా కనపడనివ్వకుండా ఇచ్చారు.