కర్ణాటకలోని కాల్బుర్గిలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్లో రెండేళ్ల బాలుడు పడి ఇరుక్కుపోయాడు.
కర్ణాటక: కర్ణాటకలోని కాల్బుర్గిలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్లో రెండేళ్ల బాలుడు పడి ఇరుక్కుపోయాడు. ఆడుకుంటూ వెళ్లినబాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు ప్రాథమికంగా తెలిసింది.
తొలుత ఇంట్లో వాళ్లు ఎంత ప్రయత్నించినా అతడిని వెలికి తీసేందుకు సాధ్యం కాలేదు. దీంతో సహాయక సిబ్బంది వచ్చి మెషిన్ను కత్తిరించి బాలుడిని బయటకు సురక్షితంగా తీశారు. అతడికి ఎలాంటి గాయాలు అవలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.