
ప్రతీకాత్మక చిత్రం
ఆజ్మాన్: పెద్దల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలను చిదిమేసిన ఘటన యూఏఈలోని ఆజ్మాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ నాలుగు ఏళ్ల బాలుడి తల్లి బయటకు వెళ్తూ పిల్లాడిని అల్ రవాదాలో నివాసం ఉంటున్న అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్లింది. అయితే బాలుడు తనను ఎవరు గమనించని సమయంలో లాండ్రీ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడున్న ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్‌లో ఎముందనుకున్నాడో తెలియదు గానీ.. బాలుడు అందులోకి దూరాడు. ఆ తర్వాత డోర్ మూసేసుకున్నాడు. వెంటనే అటోమేటిక్‌గా వాషింగ్ మెషిన్ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా వేడి నీళ్లు మెషిన్‌లోకి చేరడం, మెషిన్ తిరగడం ప్రారంభం కావడంతో.. అందులో చిక్కుకున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో బాలుడి అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నాడు.
కాగా, బయటికి వెళ్లి వచ్చిన బాలుడి తల్లి.. అతని కోసం వెతుకుంతుడగా కనిపించలేదు. వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి దాన్ని ఆపివేశారు. ఆ తర్వాత డోర్ తెరచి చూస్తే బాలుడు ఘోరమైన స్థితిలో శవమై కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్ట తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment