Ajman
-
కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్.. భార్య మృతి
దుబాయ్: ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వాహనం భార్య మీదకు దూసుకెళ్లడంతో మహిళ మరణించింది. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకోగా స్థానిక మీడియా సోమవారం ప్రచురించింది. వివరాలు.. లిజీ తన భర్తతో కలిసి శనివారం హెల్త్ చెకప్ కోసం తమ కమ్యూనిటీలోని ఆసుపత్రికి వెళ్లారు. యూఏఈలోని అజ్మాన్ ఎమిరేట్‌లోని ఆసుపత్రి వద్దకు వచ్చాక లిజీ కారు ఎదుట నిల్చోని వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న తన భర్తకు డైరెక్షన్స్ చెబుతోంది. ఈ క్రమంలో అనుకోకుండా కారు వేగంగా ముందుకు దూసుకు రావడంతో లిజీని ఢికొని సరిహద్దు గోడకు తాకింది. చదవండి: దారుణం: ఏడేళ్లుగా అత్యాచారం.. కూతురికి గర్భం ఈ ప్రమాదంలో మహిళకు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా లీజీ, తన భర్త ఇద్దరూ కేరళకు చెందిన వారు. పదేళ్ల క్రితమే ఈ జంట దుబాయ్లోలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తుండగా కూతురు దుబాయ్‌లో చదువుతోంది. కాగా ఈ విషయం తెలియగానే యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ షాక్‌కు గురైనట్లు ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిట్టికా తెలిపారు. ఈ ఘటనపై అజ్మాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఇండియన్ అసోసియేషన్ కుటుంబానికి సహకరిస్తోందన్నారు. -
రాహుల్ గాంధీ ప్రత్యర్థి అరెస్ట్
దుబాయ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పోటీచేసి ఓడిపోయిన ఎన్డీఏ అభ్యర్థి, భారత ధర్మ జనసేన(బీడీజీఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి అరెస్ట్ అయ్యారు. ఓ చెక్ బౌన్స్ కేసులో తుషార్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజ్మాన్ సెంట్రల్ జైలుకు తరలించారు. అజ్మాన్‌లో స్థిరపడిన కేరళకు చెందిన వ్యాపారి నాసిల్ అబ్దుల్లా ఈ చెక్‌బౌన్స్ కేసు పెట్టాడు. అసలేం జరిగిందంటే.. తుషార్ వెల్లపల్లి కొంత మంది సన్నిహితులతో కలిసి దుబాయ్‌లో పదిహేనేళ్ల క్రితం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు. అయితే ఆ వ్యాపారంలో నష్టాలు వాటిల్లడంతో పదేళ్ల క్రితమే ఆ కంపెనీని అమ్మేశారు. ఆ సమయంలో నాసిల్ అబ్దుల్లాకు రూ. 19కోట్ల విలువ చేసే చెక్‌లు తుషార్ ఇచ్చారు. అయితే అంత డబ్బు బ్యాంకులో లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో పదేళ్ల నుంచి వేచి చూసిన నాసిల్ పక్కా ప్రణాళిక ప్రకారం తుషార్‌ను అజ్మాన్‌కు రప్పించి ఓ హోటల్లో దింపాడు. అప్పటికే స్థానిక పోలీసులకు అబ్దుల్లా ఫిర్యాదు చేయడంతో హోటల్‌కు చేరుకన్న పోలీసులు తుషార్‌ను అరెస్ట్ చేశారు. అయితే తుషార్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతడికి చట్టప్రకారమే కొంత ఉపశమనం కలిగేలా చూడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. -
వాషింగ్ మెషిన్లో చిక్కుకుని బాలుడి మృతి
ఆజ్మాన్: పెద్దల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలను చిదిమేసిన ఘటన యూఏఈలోని ఆజ్మాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ నాలుగు ఏళ్ల బాలుడి తల్లి బయటకు వెళ్తూ పిల్లాడిని అల్ రవాదాలో నివాసం ఉంటున్న అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్లింది. అయితే బాలుడు తనను ఎవరు గమనించని సమయంలో లాండ్రీ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడున్న ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్లో ఎముందనుకున్నాడో తెలియదు గానీ.. బాలుడు అందులోకి దూరాడు. ఆ తర్వాత డోర్ మూసేసుకున్నాడు. వెంటనే అటోమేటిక్‌గా వాషింగ్ మెషిన్ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా వేడి నీళ్లు మెషిన్‌లోకి చేరడం, మెషిన్ తిరగడం ప్రారంభం కావడంతో.. అందులో చిక్కుకున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో బాలుడి అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. కాగా, బయటికి వెళ్లి వచ్చిన బాలుడి తల్లి.. అతని కోసం వెతుకుంతుడగా కనిపించలేదు. వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి దాన్ని ఆపివేశారు. ఆ తర్వాత డోర్ తెరచి చూస్తే బాలుడు ఘోరమైన స్థితిలో శవమై కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్ట తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
‘మా నౌక మునిగిపోతోంది.. కాపాడండి’
న్యూఢిల్లీ: ‘మేడం మేము వెళ్లుతున్న నౌక మునిగిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పటికే నౌకలోకి చాలా నీళ్లు వచ్చాయి. దయచేసి మమల్ని కాపాడండి. మేమంతా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లాలనుకుంటున్నామని’ అంటూ ఓ నావికుడు పంపిన ఎస్ఓఎస్ మెసేజ్‌కు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తక్షణమే స్పందించారు. యూఏఈలోని అజ్మాన్ ప్రాంతంలో నడిసద్రంలో చిక్కుకుపోయిన నావికులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘నావికులు సముద్రంలో చిక్కుకున్న వార్త ఇప్పుడే చూశాను. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామ’ని సుష్మ తెలిపారు. అనూప్ పాఠక్ అనే నావికుడు మెసేజ్ పంపడంతో ఆమె వెంటనే స్పందించారు. నాలుగు నౌకల్లో 41 మంది భారతీయ నావికులు చిక్కుకున్నట్టు మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. ఈ నౌకలకు సంబంధించిన యజమాని నావికుల పాస్ పోర్టులు లాక్కుని పత్తా లేకుండా పోయాడు. ఏడాదిగా వీరికి వేతనాలు కూడా చెల్లించడం లేదని స్థానిక మీడియా తెలిపింది.