రెండు ఓఎస్‌లపై పనిచేసే మైక్రోమ్యాక్స్ ‘ల్యాప్‌ట్యాబ్’
లాస్‌వేగాస్: మైక్రోమ్యాక్స్.. ల్యాప్‌ట్యాబ్ పేరుతో రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పని చేసే కొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొస్తోంది. విండోస్ 8, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌లపై పనిచేసే ఈ ల్యాబ్‌ట్యాబ్ ధర రూ.30,000 లోపు ఉంటుందని మైక్రోమ్యాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. ఇక్కడ జరుగుతున్న కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించిన ఈ ట్యాబ్లెట్‌ను వచ్చే నెల నుంచి భారత్‌లో విక్రయిస్తామన్నారు. ఈ ట్యాబ్‌లో 1.46 గిగాహెర్ట్జ్ ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, 10.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 64 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయి.