హైదరాబాద్: ప్రముఖ దేశీ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ ‘యునైట్ 3’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,999. ఆండ్రాయిడ్ లాలీపాప్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.7 అంగుళాల తెర, 1.3 గిగాెహ డ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 10 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే వినియోగదారులు ట్రాన్స్‌లేట్, ట్రాన్స్‌లిటరేట్ చేసుకునేందుకు అనువైన యునైట్ మెసేజింగ్ సర్వీస్ ఫీచర్ దీని సొంతం.