సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ‘ఇన్’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మైక్రోమాక్స్ మంగళవారం లాంచ్ చేసింది. ఇన్ నోట్ 1, ఇన్1బీ పేరుతో స్మార్ట్‌న్లను మంగళవారం లాంచ్ చేసింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగి రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కంపెనీ అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధరలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతున్న షావోమి,రియల్‌మి లాంటి సంస్థలకు భారీ షాక్ ఇవ్వనుంది. డిజైన్ పరంగా అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. “ఇల్యూమి నేటింగ్ ప్రిజం పాటర్న్ అంటూ వెనుక ‘ఎక్స్’ పాటర్న్ ఆకర్షణీయంగా ఉంది.
ఇన్ నోట్ 1ఫీచర్లు
6.67అంగుళాల పూర్తి హెచ్‌డీ + డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా టెక్‌హీలియో జీ 85 ప్రాసెసర్
48+5+2+2 ఎంపీరియర ఏఐ క్వాడ్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వా (టైప్-సి)
ఫ్లిప్‌కార్ట్, సంస్థ వెబ్‌సైట్ ద్వారా నవంబరు 24 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం.
ఇన్ నోట్ 1 ధరలు
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499
Comments
Please login to add a commentAdd a comment