వాల్నట్ చెక్కతో మైక్రోమ్యాక్స్ స్పెషల్ ఎడిషన్ | Micromax Canvas 5 Lite special edition with wood-finish rear panel unveiled | Sakshi
Sakshi News home page

వాల్నట్ చెక్కతో మైక్రోమ్యాక్స్ స్పెషల్ ఎడిషన్

Published Tue, Aug 16 2016 1:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

వాల్నట్ చెక్కతో మైక్రోమ్యాక్స్ స్పెషల్ ఎడిషన్

వాల్నట్ చెక్కతో మైక్రోమ్యాక్స్ స్పెషల్ ఎడిషన్

దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ కొత్తగా ఆవిష్కరించిన కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ప్రస్తుతం కంపెనీ సైట్లో నమోదైంది.

దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ కొత్తగా ఆవిష్కరించిన కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ప్రస్తుతం కంపెనీ సైట్లో నమోదైంది. దీని ధర వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, ఈ హ్యాండ్సెట్ను త్వరలోనే విక్రయించనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్ను వాల్నట్ ఉడ్ ఫినిస్తో రూపొందించడం కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ సైతం దీనికి మరో హైలెట్. గతేడాది రూ.11,999కు లాంచ్ చేసిన కాన్వాస్ 5 స్మార్ట్ఫోన్కు లైట్ వేరియంట్గా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది.

కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు.
 5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్
1గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
16 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్
8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
2000 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement